TG: సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మంగ్లీ తనను రూ. 10 కోట్ల మేర మోసం చేసిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై BNS సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.