KNR: సైదాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మూడు రోజులపాటు జరిగిన వార్డు మెంబర్ల శిక్షణ తరగతులు శుక్రవారం ముగిసినట్లు ఎంపీడీవో యాదగిరి తెలిపారు. 13 గ్రామాలకు చెందిన 119 మంది వార్డు మెంబర్లకు మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో బషీరుద్దీన్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.