SRPT: నేరేడుచర్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులతో కలిసి అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్రా నుండి ధాన్యం లారీలు తెలంగాణలోకి రాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు.