NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రానికి దారి సమస్యకు సర్పంచ్ ఆవుల సుందర్, రైతు ముక్కామల్ల యాదయ్య చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. రైతు యాదయ్య తన భూమి గుండా రహదారికి అంగీకరించడంతో, జేసీబీతో తాటి చెట్లను తొలగించి దారిని విస్తరించారు. దీనివల్ల లారీలు, ట్రాక్టర్ల రాకపోకలు సులువై ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కానున్నాయి.