ADB: ఈ నెల 13న ఉట్నూర్ మండలం నర్సాపూర్ (జె) గ్రామంలో నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంప్ ను విజయవంతం చేయాలని ఉట్నూర్ సీఐ సర్పంచ్లకు సూచించారు. శనివారం పోలీస్ స్టేషన్లో సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. ఈ శిబిరానికి రాష్ట్ర డీజీపీతో పాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని, 15 మంది నిపుణులైన వైద్యులు సేవలందిస్తారని తెలిపారు.