TPT: శ్రీకాళహస్తిలో ఈనెల 15న జరగనున్న జాబ్ మేళా పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆవిష్కరించారు. జేఎన్టీయూఏ–స్కిట్లో నిర్వహించే ఈ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొని 2000కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.