KNR: జమ్మికుంట మండలంలో అక్రమ ఇసుక రవాణాపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్కు వెంకటేశ్వర్ల పల్లి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలింపు సాగుతుందని, చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బావుల కోసం వేసుకున్న రోడ్లు ధ్వంసం చేస్తూ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు.