JN: మెయింటెనెన్స్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దు అని దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామ రైతులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా మధ్యానం సమయంలో విద్యుత్‌లో అంతరాయం జరుగుతుందని, దీంతో చేతికందిన వరి పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే మెయింటనెస్స్ అని అంటున్నారు అని, ఇలా చేయొద్దు అని అన్నారు.