MDK: చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవ్వలపల్లి చౌరస్తాలో గల ఎరువుల దుకాణాలను అదనపు కలెక్టర్ నగేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని నిల్వలను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, నిబంధనల ప్రకారం విక్రయాలు జరపాలని యజమానులకు సూచించారు. నిల్వలలో తేడాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.