NLG: జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రభుత్వం మరో అద్భుత అవకాశం కల్పించింది. రివైజ్డ్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద అమలు చేస్తున్న రెండు పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.