AP: మన్యం జిల్లా పార్వతీపురంలో దారుణం చోటుచేసుకుంది. వెలగవలస గ్రామంలో చేతబడి చేశాడనే నెపంతో రమేష్ అనే వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపారు. రమేష్ మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని గ్రామస్థులంతా కలిసి అక్కడికక్కడే దహనం చేశారు. దీని గురించి సమాచారం అందుకున్న పార్వతీపురం రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, సగం కాలిన మృతదేహాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కేసు నమోదు చేశారు.