ADB: సిరికొండ మండలం రాయిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఎంపీవో సంతోష్ ప్రారంభించారు. లబ్ధిదారులకు మంజురైన ఇళ్ల నిర్మాణాలకు పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని గుత్తేదారులకు సూచనలు చేశారు. లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్న ఉన్నతాధికారులను సంప్రదించాలని అన్నారు.