గుంటూరు నగరంలోని మోతీలాల్ నగర్ జీరో లైన్లో ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే 60 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లు కూల్చొద్దని సీపీఐ నాయకులు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందించారు. జంగాల అజయ్, కోటా మాలాద్రి తదితరులు పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.