ATP: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి అర్జీపై తక్షణమే స్పందించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.