KMM: మధిర మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద మొక్కజొన్న సేకరణ కేంద్రాన్ని డీఏవో పుల్లయ్య ఇవాళ సందర్శించారు. కొనుగోలు ప్రక్రియపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదికలో రైతులతో సమావేశమైన ఆయన.. నానో యూరియా, నానో డీఏపీ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, పంట మార్పిడి, డిమాండ్ ఆధారిత సాగు యొక్క ప్రయోజనాలను వివరించారు.