AP: కూటమి ప్రభుత్వం విలేజ్ సర్వీస్ ఇనాం భూములకు విముక్తి కల్పిస్తూ రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 1,36,024.38 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ CS, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ.సాయిప్రసాద్ ఆదేశాలిచ్చారు. ఆయా భూముల రిజిస్ట్రేషన్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.