ASF: సిర్పూర్ (టీ) మండలం వీర్దండి గ్రామపంచాయతీలో నూతన CC రోడ్డు నిర్మాణ పనులను శనివారం గ్రామ సర్పంచ్ పార్చాకే వనిత ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు పనుల మంజూరుకు సహకరించిన MLC విఠల్‌కు సర్పంచ్, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు.