ADB: ఉట్నూర్ ఎంపీడీవో గ్రౌండ్లో ఈనెల 21న నిర్వహించనున్న ‘అంబేడ్కర్ జీవిత చరిత్ర’ నాటక ప్రదర్శన ప్రచార రథాన్ని ఆర్టీఏ మెంబర్ రాజేశ్వర్ ప్రారంభించారు. బాబాసాహెబ్ ఆశయాలను, ఆయన పోరాట పటిమను నేటి తరానికి వివరించడమే ఈ నాటిక ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనకు పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.