NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల MPPS ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా HM, M.సరిత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్దులకు నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, వాలంటీర్లు ఉన్నారు.