HYD: తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 కోట్ల నిధులతో కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం, ఆధునిక వసతుల కల్పనపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన నివాస సౌకర్యాలు అందించే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.