KRNL: కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జీఎస్టీ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డా.ఏ. సిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ వసూళ్ల పురోగతి, పెండింగ్ అంశాలు, పన్ను చెల్లింపుల పర్యవేక్షణపై చర్చించారు. శాఖల మధ్య సమన్వయం పెంచి ఆదాయాన్ని మెరుగుపరచాలన్నారు.