TG: కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4% లోపే చూపడంపై రాష్ట్ర మున్నూరు కాపు సంఘం మండిపడింది. ఇది బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించే కుట్ర అని, తమ హక్కులను కాలరాసే ప్రయత్నమని ఆరోపించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఈ గణాంకాలను వెంటనే సవరించాలని, లేదంటే ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తామని అధ్యక్షుడు పురుషోత్తం హెచ్చరించారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు స్పష్టం చేశారు.