2026 T20 WCలో ఫిక్సింగ్ కలకలం రేగుతోంది. చెన్నైలో న్యూజిలాండ్, కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ICC అధికారికంగా విచారణకు ఆదేశించింది. ఈ మ్యాచ్‌లో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన 5వ ఓవర్లో వరుసగా నోబాల్స్, వైడ్లు వేసి 15 పరుగులు ఇచ్చాడు. దీనిపై ఓ డాక్యుమెంటరీ సంచలన విషయాలను ప్రస్తావించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.