RR ఆల్రౌండర్, శ్రీలంక T20 కెప్టెన్ దాసున్ షనకపై పాక్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. PSLలోని లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లఘించినందుకు ఏడాది పాటు నిషేధం విధించింది. దీనిపై షనక స్పందిస్తూ.. ‘PSL నుంచి తప్పుకోవడం నా తప్పే. అభిమానులను నిరాశపరిచినందుకు క్షమించండి. భవిష్యత్తులో తిరిగి ఈ లీగ్లో పాల్గొనే ఛాన్స్ వస్తుందనుకుంటున్నా’ అని అన్నాడు.