NRPT: ఉపాధి హామీ పథకంలో అత్యధిక కూలీలకు ఉపాధి కల్పించిన మద్దూరు మండలం పెద్రీపహాడ్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఖాజా హుస్సేన్‌కు కలెక్టర్ ప్రతీక్ జైన్ రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కూలీలకు నిత్యం అండగా ఉండి మెరుగైన వసతులు కల్పించినందుకు ఈ గుర్తింపు లభించిందన్నారు. తన కృషికి సహకరించిన ఎంపీడీవో, ఏపీవో, సర్పంచ్, కార్యదర్శికి హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు.