MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా 80 మంది విద్యార్థులను గుర్తించినట్లు హెచ్ఎం తారా సింగ్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించేలా బుధవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రతినిధులు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు.