ADB: 8వ పోషణ్ పక్వాడా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. చిన్న పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో కీలకమని అన్నారు. ‘పోషణ్ పక్వాడా’ వంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంచడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.