TG: జగిత్యాల సభలో KCR అబద్దాలు చెప్పారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ చావును కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని, రైతుబంధు పథకం కోసం రింగు రోడ్డును కేసీఆర్ కుదువపెట్టారని తెలిపారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. పథకాలు సకాలంలో ఇస్తున్నందున రేవంత్ పోవాలా? అన్నారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు బండి సంజయ్ చొరవ చూపాలన్నారు.
Tags :