NLG: దేవరకొండ మండలం మైనంపల్లి కొర్రతండా అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈసమావేశానికి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. బాలింతలు. గర్భిణీ మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహారం గురించి వివరించారు. అదేవిధంగా బాల్యవివాహాలను అరికట్టేలా చూడాలని కోరారు.