MHBD: తొర్రూరు పట్టణంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే మామిడాల రాజేశ్వర్ రెడ్డి ఉచిత శిక్షణ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. సాంకేతిక విజ్ఞానంపై అవగాహన పెంచేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కోచింగ్ పొందలేని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.