BHPL: కాటారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 22 వరకు గడువు పొడిగించినట్లు HM డా. రాజకుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలల్లో మొత్తం 1,920 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు ఉచిత రిజిస్ట్రేషన్ కోసం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సంప్రదించాలని ఆయన సూచించారు.