JN: అవినీతి, అక్రమాలకు దూరంగా ఉన్నాను.. కాబట్టే గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నవాబుపేటలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… సకలజనుల పోరాటం, ఎందరో ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని, వచ్చిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందని, అధికారం అడ్డం పెట్టుకొని వేలకోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారని అన్నారు.