ములుగు జిల్లాలో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కరావ్ అలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామం కాల్వపల్లిలో మంగళవారం అడుగుపెట్టి తల్లిని కలిశారు. దళ కమాండర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, అంచెలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగింది. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన అనంతరం స్వగ్రామానికి రావడం ఇదే తొలిసారి.