ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.