MDCL: ఉప్పల్ సర్కిల్ పరిధిలో మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి విస్తృత పర్యటన నిర్వహించారు. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఎంటమాలజీ విభాగం చేపడుతున్న దోమల నివారణ చర్యలు, ఫాగింగ్ పనులను పరిశీలించి మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సమస్యలను గుర్తించాలన్నారు.