మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంగళవారం పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీలో డ్వాక్రా బజార్లో వివిధ మండలాలకు చెందిన వీవోఏలకు ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన డ్వాక్రా వ్యవస్థతో మహిళలు స్వయం సాధికారత సాధించి అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని తెలిపారు.