SRD: ఆర్టీసీ సమ్మె సందర్భంగా బస్సులు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తే సహించేది లేదని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. సమ్మె పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని చెప్పారు. ఆర్టీసీ బస్సులు నడపడానికి అర్హత కలిగిన డ్రైవర్లు ముందుకు రావాలని సూచించారు. ఆసక్తి ఉన్న డ్రైవర్లు జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 87126 56739కు సమాచారం ఇవ్వాలని కోరారు.