KMR: జిల్లాలో RTC కార్మికుల సమ్మె శాంతియుతంగా జరగాలని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. విధుల్లో చేరే సిబ్బందికి రక్షణ కల్పిస్తామని, అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. బస్సు టైర్ల గాలి తీసిన ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు బందోబస్తు, CC నిఘా ఏర్పాటు చేశామన్నారు.