KMM: వేంసూరులో బుధవారం మహిళల భద్రతే లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో సీడీపీవో మెహరున్నిషా బేగం మాట్లాడారు. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా 1098 (చైల్డ్ లైన్), 100 (పోలీస్), 1930 నంబర్ల ప్రాముఖ్యతను వివరించారు.