VSP: అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో మే 2వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం పద్మనాభంలో మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆలయ కోనేరు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.