KDP: జిల్లాలోని ICDS శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ పోస్టుల భర్తీకి ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ICDS PD రమాదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 అంగన్వాడీ వర్కర్లు, 141 హెల్పర్ పోస్టులకు ఆయా రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.