సత్యసాయి: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.