నెల్లూరు జిల్లాలో నిషేధిత కాల్షియం కార్బైడ్ రసాయనాలతో పండ్లను కృత్రిమంగా పండించే వ్యాపారులపై చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలకు పాల్పడితే రూ.10 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు.