PLD: బొల్లాపల్లి మండలంలో మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా సీసాలను వెరిఫై చేసి 9 నమూనాలను రసాయన పరీక్షకు పంపారు. ధరలు పరిశీలించగా, అక్రమాలపై నిఘా కొనసాగుతోందని ఇన్స్ఫెక్టర్ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. బహిరంగ మద్యపానం నేరమని ఆయన హెచ్చరించారు.