W.G: జిల్లాలో రబీ ధాన్యం సేకరణను పారదర్శకగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. బుధవారం భీమవరం భారతి విద్యాభవన్లో జరిగిన మిల్లర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు గోనె సంచుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సదరు మిల్లర్లకు ‘జీరో టార్గెట్’ విధిస్తామని జేసీ హెచ్చరించారు.