చాలామంది తలనొప్పి రాగానే.. వాళ్లకు తెలిసిన టాబ్లెట్స్ వాడుతుంటారు. ఎక్కువగా అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి మందులు వేసుకుంటారు. అయితే అవి ఎక్కువగా వాడకూడదని డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ తెలిపారు. దీనివల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరించారు. అలాగే తలనొప్పి వచ్చినప్పుడు సమస్యను నిర్లక్ష్యం చేయవద్దని.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు.