VZM: రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) తాజా నివేదిక ప్రకారం.. జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తీవ్రమైన ఎండలు మరియు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ డా ప్రభాకరరెడ్డి మంగళవారం తెలిపారు. ముఖ్యంగా జిల్లాలోని 15 మండలాలు డేంజర్ కేటగిరీలో (ప్రమాదకర స్థాయిలో) ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. కావున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.