TG: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనకుండా కాంట్రాక్టర్లను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా ఉన్న కాంట్రాక్ట్ సంస్థకే మూసీ పునరుజ్జీవ పనులు అప్పగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఇవ్వలేదన్నారు.