BDK: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం నిత్య కళ్యాణ వేడుక భక్తిరసపూర్ణంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం కళ్యాణ మండపంలో సీతారాముల వివాహ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. అనంతరం ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.