TG: BJP అంటే కాంగ్రెస్, BRSకు భయమని BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు ఆరోపించారు. ఆ పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది BJPనే అని ధీమా వ్యక్తం చేశారు. కేవలం మేడిగడ్డపైనే విచారణ అంటున్నారని, KCR, రేవంత్ మధ్య ఒప్పందం ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను KCR కాపాడారు. ఇప్పుడు కాళేశ్వరంలో రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని అన్నారు.